హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వద్ద నిర్వహించిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర గారి అంత్యక్రియల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్ నాగరాజు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ డీజీపీ హెచ్‌జే దొర గారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ నివాళులర్పణ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


