హన్మకొండ: స్థానిక బస్టాండ్‌లో సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు.
64 ఏళ్ల జాన్ అబ్రహం అనే ప్రయాణికుడు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా కింద పడిపోయారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సు చక్రం ఆయన కుడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మరియు తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది రామచందర్ మరియు తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు.
క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.


