HomeWarangal Newsహన్మకొండలో చైన్ స్నాచింగ్ కలకలం: పట్టపగలే మహిళ మెడలో గొలుసు చోరీ

హన్మకొండలో చైన్ స్నాచింగ్ కలకలం: పట్టపగలే మహిళ మెడలో గొలుసు చోరీ

Published on

spot_img

హన్మకొండ: నగరంలో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే జనం తిరిగే ప్రాంతంలో మహిళను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హన్మకొండ నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సిటిజన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి మెరుపు వేగంతో ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు.

​బాధితురాలు తేరుకునేలోపే దుండగుడు అక్కడి నుండి మాయమవ్వడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ​సమాచారం అందుకున్న వెంటనే హన్మకొండ సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. 

నిందితుడిని పట్టుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగా వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.