హన్మకొండ: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందుదామనే ఆశతో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ఉదయం 10:35 గంటలు దాటినా ఫిర్యాదులను స్వీకరించడానికి సంబంధిత అధికారులు రాకపోవడంతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో కాన్ఫరెన్స్ హాల్ బయట ప్రాంతం పూర్తిగా కిక్కిరిసిపోయింది.
దూర ప్రాంతాల నుండి వచ్చిన వృద్ధులు, మహిళలు అధికారుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు సమయపాలన పాటించాలని బాధితులు కోరుతున్నారు.


