హనుమకొండ: వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు.
ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది హాజరు వివరాల రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం వైద్య సేవల నిర్వహణ తీరు, రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది లభ్యతపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పలువురు సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


