భద్రకాళి దేవస్థాన పరిధిలోని చెరుబండరాజు నగర్ కాలనీ వాసుల విషయంలో మానవ హక్కుల కమిషన్ (HRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేయడంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కోర్టు స్టే అమల్లో ఉన్నప్పుడు నివాసితులను ఇబ్బంది పెట్టడం సరికాదని అధికారులను హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విచారణకు హాజరైన సీఎస్ వనజ, హన్మకొండ తహశీల్దార్ రవీందర్ రెడ్డిపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని మందలించింది.
కాలనీ వాసుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, నిబంధనలను అతిక్రమించవద్దని స్పష్టం చేసింది.


