HomeWarangal Newsతెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత మార్పులు

తెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత మార్పులు

Published on

spot_img

తెలంగాణ పోలీస్ శాఖలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో అధికారులు మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో మార్పులు చేపట్టారు.

ఈ మార్పుల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లను కలిపి మొత్తం 12 జోన్‌లుగా విభజించారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు 6 జోన్‌లు, సైబరాబాద్‌లో 3 జోన్‌లు, రాచకొండలో 3 జోన్‌లు ఏర్పాటు అయ్యాయి. ఇకపై శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.

దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా హైదరాబాద్ పోలీస్ పరిధిలోకి చేరనుంది.

హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఆరు జోన్‌లు:

• చార్మినార్ జోన్
• గోల్కొండ జోన్
• ఖైరతాబాద్ జోన్
• రాజేంద్రనగర్ జోన్
• సికింద్రాబాద్ జోన్
• శంషాబాద్ జోన్

సైబరాబాద్ కమిషనరేట్‌లో కొత్త మార్పులు:

• శేరిలింగంపల్లి జోన్ – మొయినాబాద్ నుంచి పటాన్ చెరు వరకు పరిధి
• కూకట్పల్లి జోన్ – మాదాపూర్ పరిథి ఇందులోకి
• కుత్బుల్లాపూర్ జోన్

రాచకొండ కమిషనరేట్ జోన్‌లు:

• ఎల్బీనగర్ జోన్
• మల్కాజిగిరి జోన్
• ఉప్పల్ జోన్

తాజా మార్పులతో పోలీసు జిల్లాలకు కూడా పునర్విభజన చేపట్టారు. యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిని మహేశ్వరం జోన్‌గా పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం.

అంతేకాక, షాద్‌నగర్ మరియు చేవెళ్లను కలిపి “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా ఉంది.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.