HomeLatest Newsఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. తండ్రి, రెండున్నరేళ్ల కుమారుడు దుర్మరణం

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. తండ్రి, రెండున్నరేళ్ల కుమారుడు దుర్మరణం

Published on

spot_img

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఒకే కుటుంబం ప్రయాణిస్తున్న కారు, చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేద ప్రకాష్ రెడ్డితో పాటు అతని రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ అక్కడికక్కడే మృతి చెందారు.

హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన దేవుడి పండగకు హాజరైన ఆయన, మంగళవారం తిరిగి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. కారులో ఆయన భార్య హిమబిందు, కుమారుడు అర్జున్, కజిన్ దుర్గాప్రసాద్ రెడ్డి మరియు అతని భార్య శ్రీజ ఉన్నారు.

​ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కిన వీరి కారు, పెద్ద అంబర్‌పేట్ సమీపంలో రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వేద ప్రకాష్, చిన్నారి అర్జున్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన హిమబిందు, దుర్గాప్రసాద్, శ్రీజలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.