HomeLatest Newsదేశంలోనే ఫస్ట్ టైమ్.. హైదరాబాద్ పోలీసుల ఏఐ ‘కాప్‌రైటర్’ యాప్‌.. ప్రత్యేకత ఇదే..!

దేశంలోనే ఫస్ట్ టైమ్.. హైదరాబాద్ పోలీసుల ఏఐ ‘కాప్‌రైటర్’ యాప్‌.. ప్రత్యేకత ఇదే..!

Published on

spot_img

హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ AI-CopWriter పేరుతో కృత్రిమ మేధా ఆధారిత మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో హైదరాబాద్ సీపీ V.C. Sajjanar ఈ యాప్‌ను ఆవిష్కరించారు. నగరంలోని 80కిపైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

భాష సమస్యల వల్ల ఫిర్యాదులు నమోదు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా భారతీయ భాషలను ఇది గుర్తించగలదు . బాధితులు తమ మాతృభాషలో చెప్పిన వివరాలను యాప్ వెంటనే టెక్స్ట్ రూపంలోకి మార్చి పోలీసులకు అర్థమయ్యే భాషలో అనువదిస్తుంది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ వేగవంతం కానుంది.

ఫిర్యాదు నమోదు చేసిన అధికారి వివరాలు, సమయం వంటి సమాచారం ఆటోమెటిక్ గా పిడిఎఫ్ రూపంలో భద్రపరుస్తుంది. బాధితుడు, నిందితుడు, సాక్షుల మాటలను వేరువేరుగా గుర్తించి రికార్డ్ చేయగల సామర్థ్యం కూడా ఈ యాప్ లో ఉంది. బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును హైదరాబాద్ సిటీ పోలీస్ అభివృద్ధి చేసింది. ఇప్పటికే “సి-మిత్ర” ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదులలో ఏఐ వినియోగిస్తున్న హైదరాబాద్ పోలీసులు.. ఇప్పుడు ఈ కొత్త యాప్ తో పోలీసింగ్ లో మరింత పారదర్శకత వేగం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Latest articles

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి
spot_img

Related Articles

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.