HomeLatest Newsహైదరాబాద్‌లో కలకలం: విద్యార్థికి మతాచారాల హోం వర్క్.. టీచర్ సస్పెన్షన్

హైదరాబాద్‌లో కలకలం: విద్యార్థికి మతాచారాల హోం వర్క్.. టీచర్ సస్పెన్షన్

Published on

spot_img

హైదరాబాద్:నగరంలోని సైదాబాద్‌ ప్రాంతంలో ఉన్న ‘సక్సెస్’ స్కూల్‌లో మతపరమైన బోధనలు జరుగుతున్నాయంటూ ఒక విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు, సదరు ఉపాధ్యాయురాలి తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

​అసలేం జరిగిందంటే?

​బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదరు పాఠశాలలో చదువుతున్న తమ రెండేళ్ల అబ్బాయి హోం వర్క్ బుక్‌లో టీచర్ వివాదాస్పద రీతిలో హోం వర్క్ రాశారు. ఆ బుక్‌లో ‘కల్మా చదవాలి’ (read surah fateha / read 2 kalma) అని ఉపాధ్యాయురాలు రాయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

​చిన్న వయసు పిల్లలపై ఇలా మతాలను రుద్దడం ఏంటని ప్రశ్నిస్తూ వారు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు.

​యాజమాన్యం చర్యలు – ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన

​ఈ ఘటనపై బాధితుల నుంచి నిరసన వ్యక్తమవడంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించింది. వివాదానికి కారణమైన సదరు టీచర్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

​మరోవైపు ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలల్లో ఇలాంటి మతపరమైన ప్రచారాలు, బోధనలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది.

Read Warangal News and Latest Politics News and Real Estate 

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.