“నాకు అలాంటి ఆలోచనలు లేవు..ఎప్పటికి రావు”..చరణ్ సెన్సేషనల్ కామెంట్స్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం “పెద్ది” విడుదలకు సిద్ధమవుతుంది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ ప్రిస్టీజియస్ సినిమాకి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇటీవల చిత్రంలోని “హెల్లల్లల్లో” పాటకు సంబంధించిన కొన్ని డాన్స్ స్టెప్పులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల్లో కొంతమంది ఈ స్టెప్పులను అభ్యంతరకరంగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్నారు . ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఆ వివాదం పై స్పందించారు.

“పాటలోని డాన్స్ మూమెంట్స్ ను అసభ్యంగా చూపించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు అని ఆయన స్పష్టం చేశారు”. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన “నాటు నాటు” పాటను ఎంత ఆస్వాదించారో ఈ పాటను కూడా అదే భావంతో చేశానని తెలిపారు. నటీనటుల మధ్య ఉన్న కెమిస్ట్రీ పాటకు అవసరమైన ఎనర్జీని మాత్రమే తెరపై చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకు వచ్చారు.

ప్రతి ప్రేక్షకుడు ఒక కళాఖండాన్ని తనదైన కోలం కోణంలో అర్థం చేసుకుంటాడని.. అందరి అభిప్రాయాలను గౌరవిస్తానని రామ్ చరణ్ పేర్కొన్నారు. అయితే తమ ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాలల్లో చర్చనీయాంసంగా మారాయి.


