ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ పరిధిలోని పలువురు కలెక్టర్లను మరియు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త నియామకాలు & బదిలీల పట్టిక:
స్నేహ శబరీష్ – హన్మకొండ కలెక్టర్ ➡️ మహబూబాబాద్ కలెక్టర్
చాహత్ బాజ్ పాయ్ ➡️ హనుమకొండ కలెక్టర్ (GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)
సందీప్ కుమార్ ఝా – జనగామ కలెక్టర్
చిత్ర మిశ్రా – ఏటూరునాగారం ITDA పీవో ➡️ కరీంనగర్ కలెక్టర్
గణేష్ – వరంగల్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్
హన్మకొండ కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్ పాయ్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
జనగామ కలెక్టర్‌గా ఉన్న రిజ్వాన్ బాషా బదిలీ అయ్యారు, ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా బాధ్యతలు తీసుకోనున్నారు.


