బ్యాంక్ ఉద్యోగాలు: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 11,403 ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 21, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రాల వారీగా పోస్టులు:
ఈ నియామకంలో ఆంధ్రప్రదేశ్‌లో 186 క్లర్క్ పోస్టులు ఉండగా, తెలంగాణలో 191 ఖాళీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత, వయోపరిమితి:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రాష్ట్రానికి చెందిన స్థానిక భాషను చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు అవసరం. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షల ద్వారా జరుగుతుంది. అనంతరం స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత, పరీక్ష విధానం, రాష్ట్రాల వారీగా ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?:
అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
అధికారిక వెబ్సైట్: https://www.ibps.in/


