ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పూర్ ఆధ్వర్యంలో JAM (Joint Admission Test for Masters) 2027 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2027-28 విద్యా సంవత్సరానికి 23 ఐఐటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం సుమారు 3,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ JOAPS పోర్టల్ ద్వారా కొనసాగుతోంది. అక్టోబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
అందుబాటులో ఉన్న కోర్సులు :
JAM స్కోర్ ఆధారంగా ఎంఎస్సీ, ఎంఎస్సీ (టెక్), ఎంఎస్ (రిసెర్చ్), ఎంఎస్సీ–ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ తదితర ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
అర్హతలు ఇవే :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు JAM 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. భారతీయ డిగ్రీ కలిగిన విదేశీ విద్యార్థులు సైతం అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఏడు సబ్జెక్టుల్లో పరీక్ష :
JAM పరీక్షను కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లకు హాజరుకావచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుంది. మొదటి సెషన్‌లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, రెండో సెషన్‌లో మిగిలిన నాలుగు సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు, పరీక్ష కేంద్రాలు :
ఒక పేపర్‌కు సాధారణ అభ్యర్థులకు రూ.2,000, రెండు పేపర్లకు రూ.2,700 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఈ ఫీజు వరుసగా రూ.1,000, రూ.1,350. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీ :
JAM 2027 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 12. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ jam.iitkgp.ac.in ను సందర్శించండి


