హన్మకొండ కేయూసీ (KUC) పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 క్వింటాళ్లు రేషన్ బియ్యం నిల్వలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ బియ్యం విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఈ బియ్యాన్ని నిల్వ చేసిన ఉర్సు భాను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించారు.


