వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పలు రకాల నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజలు, పన్ను చెల్లింపుదారులు మరియు విమాన ప్రయాణికులకు సంబంధించి పలు ముఖ్యమైన మార్పులు రానున్నాయి.
ముఖ్యమైన సమాచారం:
అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇకపై భౌతికంగా బోర్డింగ్ పాస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫోన్లోని ఈ-బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుంది.
వ్యాపార, ప్రొఫెషనల్ టాక్స్ పేయర్లు ఈ నెల 31వ తేదీలోగా తమ ఐటీ రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ తర్వాత లేట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు తమ ఈ-కేవైసీని ఈ నెల 31 నాటికి పూర్తి చేసుకోవాలి. ఆ లోపు పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోతుంది.
ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్లు, ఎల్పీజీ ఈ-కేవైసీకి రేపే (ఆగస్టు 31) ఆఖరి తేదీ కావడం వల్ల వినియోగదారులు వెంటనే ఈ పనులను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


