HomeWarangal Newsమహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్: ప్రతీ పని, ప్రతీ పథకానికి మహిళల పేరు మీదనే అమలు

కోటి మంది మహిళలకు ఒకే రకమైన చీరలు

18ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు చీరలు పంపిణి చేయాలి

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టి బొమ్మలకు కట్టే వారు

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుంది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….

ఎలాంటి కుల మత తారతమ్యం లేకుండా 18ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు చీరలు అందించాలని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీరలు అందిస్తున్నారని తెలిపారు.

మహిళా సాధికారాతకు, మహిళా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అందులో భాగంగానే ప్రతీ పనిలో, ప్రతీ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో, నిర్మాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని అన్నారు. పేదలైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.

Kadiyam Kavya Lightning

జనగామ జిల్లాలో స్టేషన్ నియోజకవర్గ పరిధిలోని 5మండలాలలో 3మండలాల స్వయం సహాయక సంఘాలకు మాత్రమే ఆర్టీసీ బస్సులు వచ్చాయని, మిగతా రెండు మండలాలకు కూడా వెంటనే ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ గారిని కోరారు.

జనగామ జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులను అందించాలని సూచించారు.

ప్రతీ ఎస్ హెచ్ జి లో ఒకరికి రెండు బర్లు లేదా నాలుగు ఆవులు ఇవ్వాలని అలాగే మండలానికి ఒక ఆర్టీసీ బస్సు, పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వనిత టీ స్టాల్స్ తో పాటు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు నాకూ మహిళలు అంటే ప్రత్యేక అభిమానం అని అన్నారు. ఎందుకంటే నాకు 3ఆడపిల్లలు, 6గురు అక్కచెల్లల్లు ఉన్నారని తెలిపారు.

పేదరికాన్ని లెక్కచేయకుండా చదువుకున్నాను కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు కడియం శ్రీహరి అని పేర్కొన్నారు.

మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

వరంగల్ ఎంపీ డాక్టర్ కకడియం కావ్య గారు మాట్లాడుతూ…..

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టి బొమ్మలకు కట్టే వారాన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు.

మహిళల సామాజిక–ఆర్థిక శక్తివంతత కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకం మహిళల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకువస్తోందని తెలిపారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం సుసంపన్నమవుతుందని ఎంపీ పేర్కొన్నారు.

మహిళలు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం అవసరమైన సదుపాయాలన్నీ అందిస్తున్నదని అన్నారు.

మహిళల ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టితో ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తోందని తెలిపారు.

Kadiyam Kavya

ఈ చీరల పంపిణీ కేవలం ఒక పథకం మాత్రమే కాదు, మహిళల పట్ల ప్రభుత్వ మనసులోని గౌరవానికి ప్రతీక అని ఎంపీ గారు అన్నారు.

ప్రతి ఇంటికి వెలుగు చేరేలా, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.

మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో కలిసి నిలుస్తుందని, మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని ఎంపీ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పీఏ సీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలయ్య, డిఆర్ డివో, ఆర్డివో, డిపిఎంలు, ఎపిఎంలు, మహిళా సంఘాల జిల్లా, మండలలాల అధ్యక్షులు, వివోలు, వివోఏలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.