HomeWarangal Newsఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధికి బాటలు..

ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధికి బాటలు..

Published on

spot_img

హనుమకొండ

తేదీ : 25/01/2026-ఆదివారం

200 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..

ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.

ఆదివారం హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కార్యక్రమంలో భాగంగా 200 మంది మైనారిటీ మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు.

MLA Naini Rajender
MLA Naini Rajender Reddy

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీల సంక్షేమాన్ని మాటల్లో కాదు, పనుల్లో చూపిస్తోందని అన్నారు.

గత పాలనలో మైనారిటీలను ఓటు బ్యాంకులా మాత్రమే చూశారని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీలను భాగస్వాములుగా భావిస్తూ వారి ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

కుట్టు మిషన్లు, వ్యాపార రుణాలు, నైపుణ్య శిక్షణల ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇది కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, అభివృద్ధికి పునాది వేస్తున్న కార్యక్రమమని అన్నారు.

MLA Naini Rajender
MLA Naini Rajender

మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో అందిస్తున్నామని, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, వృత్తి శిక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

మైనారిటీ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూసే విధానంతో పాలన సాగిస్తోందని, మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలకు భిన్నంగా ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Indiramma Minority Mahila Shakti
Indiramma Minority Mahila Shakti

లబ్ధిదారులు ఈ కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది మొదలు మాత్రమేనని, రాబోయే రోజుల్లో మైనారిటీల కోసం మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామని తెలిపారు.

ఇప్పటికే మరో 200 కుట్టు మిషన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు వెల్లడించారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మైనారిటీ అనుబంధ సంఘ నాయకులు, మైనారిటీ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...