HomeEntertainmentఫాలోవర్లను కట్టిపడేసే కొత్త టూల్..ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ‘సిరీస్’ ఫీచర్..!

ఫాలోవర్లను కట్టిపడేసే కొత్త టూల్..ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ‘సిరీస్’ ఫీచర్..!

Published on

spot_img

ఫాలోవర్లను కట్టిపడేసే కొత్త టూల్..ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ‘సిరీస్’ ఫీచర్ :

సోషల్ మీడియా దిగ్గజం “మెటా” తన ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లైన ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లల్లో కొత్త సిరీస్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ రీల్స్ ని ఒకే అంశానికి సంబంధించిన ఎపిసోడ్ ల రూపంలో సమీకరించి ప్రేక్షకులకు అందించే అవకాశం కల్పించనుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ను ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లతో పరీక్షిస్తున్నట్లు అంతర్జాతీయ టెక్ మీడియా సంస్థలను వేదికలు వెల్లడించాయి. ఒకే అంశంపై రూపొందించిన అనేక వీడియోలను వరుసగా ఒకే సిరీస్ లో వీక్షించే సౌలభ్యం ఈ ఫీచర్ ప్రత్యేకతగా నిలవనుంది. కొత్తగా రూపొందించిన రీల్స్ తో పాటు ఇప్పటికే క్రియేట్ చేసిన పాత వీడియోలను కూడా సిరీస్లలో చేర్చుకునే అవకాశం ఉండనుంది.

ఈ సౌకర్యంతో వినియోగదారులు ఒక క్రియేటర్ ప్రొఫైల్లో విడివిడిగా వెతకాల్సిన అవసరం లేకుండా ఒక రీల్ నుంచే సంబంధిత మొత్తం సిరీస్లను సులభంగా వీక్షించగలరు. దీంతో ఎపిసోడ్లు మిస్ అయ్యే అవకాశాలు కూడా తగ్గనున్నాయి. అంతేకాకుండా ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలను అందించే అవకాశాలపై కూడా మెటా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే టిక్ టాక్ లో ఇలాంటి ఫీచర్ కి మంచి ఆదరణ లభించడంతో అదే తరహా అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ వినియోగదారులకు అందించేందుకు మెటా చర్యలు చేపడుతుంది. మినీ డ్రామాలు, వెబ్ సిరీస్ లు ఎపిసోడ్ కంటెంట్ వంటి ఫార్మాట్లకు ఈ ఫీచర్ మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.