HomeLatest NewsIPL 2026 ఫైనల్‌పై వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరిది?

IPL 2026 ఫైనల్‌పై వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరిది?

Published on

spot_img

IPL 2026 ఫైనల్‌పై వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరిది?

ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మే 31న జరగనున్న గ్రాండ్ ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వర్షం అంశం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.

ఫైనల్ కు వర్షం అడ్డొస్తే ఏం జరుగుతుంది?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కి ప్రత్యేకంగా రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ మే 31న వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతే.. జూన్ 1 అదే స్థితి నుంచి ఆటను కొనసాగిస్తారు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం ప్రభావం ఉంటే ఓవర్లను తగ్గించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

కనీసం ఐదు ఓవర్లు తప్పనిసరి:

ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాలి. అవసరమైతే డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ విధానాన్ని అమలు చేసి విజేతను నిర్ణయిస్తారు. దీంతో పూర్తిస్థాయి మ్యాచ్ జరగకపోయినా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.

మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే ట్రోఫీ ఎవరికి?

ఒకవేళ ప్రధాన మ్యాచ్ రోజు రిజర్వ్ డే రెండింటిలోనూ ఆట జరగకపోతే ఐపీఎల్ నిబంధనలు అమలులోకి వస్తాయి. అప్పుడు లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నే ఛాంపియన్ గా ప్రకటిస్తారు.

ఆర్‌సీబీకి భారీ అడ్వాంటేజ్:

లీక్ దశ ముగిసే సమయానికి ఆర్సీబీ అత్యుత్తమ నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే ట్రోఫీ ఆర్సిబి ఖాతాలో పడే అవకాశం ఉంది. దీంతో బెంగుళూరు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

వాతావరణం ఎలా ఉంది..?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్ లో ఫ్రీ మాన్సూన్ ప్రభావం కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరిగే సమయానికి అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఎలాంటి అంతరాయం లేకుండా ఫైనల్ మ్యాచ్ ని ఆస్వాదించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

Latest articles

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
spot_img

Related Articles

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.