ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే పద్ధతుల్లో అవినీతి అధికారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలవారీ వాయిదాల పద్ధతిలో లంచం వసూలు చేస్తున్న జగిత్యాల జిల్లా మెట్పల్లి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఘటన వివరాలు
మెట్పల్లి పట్టణ పరిధిలో మొత్తం 21 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు, ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని సీడీపీవో పద్మ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మొత్తం 21 మంది నిర్వాహకుల నుంచి మూడు నెలలకు సంబంధించిన మొత్తం రూ.63,000 లంచం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు, కార్యాలయం వద్ద ఫిర్యాదుదారుల నుంచి రూ.63,000 నగదు తీసుకుంటుండగా సీడీపీవో పద్మను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


