న్యూఢిల్లీ పార్లమెంట్లో జన్ విశ్వాస్ (సవరణ) బిల్లుపై వరంగల్ ఎంపీ కడియం కావ్య తన గళాన్ని వినిపించారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలపై ఆమె కీలక అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
వ్యాపార సౌలభ్యం (Ease of Doing Business) పేరుతో నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన శిక్షలను తగ్గించడం వల్ల ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, మరియు కార్మిక హక్కులు దెబ్బతింటాయని ఆమె హెచ్చరించారు. ఈ సవరణలపై సమగ్రమైన మరియు విస్తృతమైన చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


