HomeLatest Newsవివాదాల సుడిగుండంలో జనగామ కలెక్టర్.. నెల రోజుల్లోనే వ్యతిరేకత

వివాదాల సుడిగుండంలో జనగామ కలెక్టర్.. నెల రోజుల్లోనే వ్యతిరేకత

Published on

spot_img

జనగామ: జనగామ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కూడా గడవక ముందే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రజావాణిలో ఓ వృద్ధుడి దీనస్థితిని చూసి చలించి, తక్షణ వైద్య సాయం అందించి అందరిచేత ‘శభాష్’ అనిపించుకున్న ఆయన, ఆ తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.

తొలుత, డీఈఓ (DEO) కార్యాలయాన్ని కలెక్టరేట్ నుండి తరలించాలనే నిర్ణయం స్థానికంగా కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. కలెక్టరేట్ ఎదుట ప్రజలకు అందుబాటులో ఉన్న టీ మరియు విజయ డెయిరీ స్టాళ్లను తొలగించాలని కలెక్టర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. ఈ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులు నష్టపోతారని, సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా, జనగణన కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా వివాదంలో పడింది. అభ్యర్థులందరికీ ఎంపికైనట్లు మెసేజ్‌లు పంపి, తీరా పరీక్షా కేంద్రానికి వెళ్తే కొందరిని మాత్రమే లోపలికి అనుమతించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో బాధితులు కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ఒకవైపు మంచి పనులతో గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్, మరోవైపు వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం జిల్లా రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.