జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, లింగంపల్లి గ్రామంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలో హుండీ లెక్కల సమయంలో ఓ అజ్ఞాత మహిళా భక్తురాలి లేఖ బయటపడింది.
సోమవారం హుండీలోని కానుకలు లెక్కిస్తుండగా ఆ లేఖలో ఇలా రాసింది:
“శ్రీధర్ తో నాకు పెళ్లి అయ్యేలా చూడండి తల్లి… నాకు ప్రభుత్వ ఉద్యోగం, శ్రీధర్ పెళ్లి అయ్యేలా చూడు తల్లి.. ఈ రెండు కోరికలు తీరుస్తే రానున్న జాతరలో తోచిన బంగారం ఇస్తాను.”
ఈ భక్తిభావం, అమ్మవారిపై అపార విశ్వాసంతో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తులు అమ్మవారి దివ్యానుగ్రహం కోసం ఇలాంటి సరళమైన, హృదయపూర్వక మొక్కులు చేస్తుంటారు.
తల్లి సమ్మక్క-సారలమ్మ భక్తురాలి కోరికలు తీర్చి, ఆనందం ఇవ్వాలని భక్తులు ప్రార్థిస్తున్నారు! 🙏


