హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) 2026 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఫుల్‌టైమ్ సెల్ఫ్ ఫైనాన్స్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 56 సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాల వారీగా సీట్ల వివరాలు :
MFA – అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్: 20 సీట్లు
MFA – ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్: 15 సీట్లు
MFA – పెయింటింగ్: 15 సీట్లు
MFA – స్కల్ప్చర్: 6 సీట్లు
విద్యార్హతలు :
సంబంధిత విభాగంలో నాలుగేళ్ల BFA లేదా సమానమైన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోర్సుకు మాత్రం మూడేళ్ల BFAతో పాటు మూడు సంవత్సరాల సంబంధిత పని అనుభవం ఉన్నవారు కూడా అర్హులు.
ఎంపిక విధానం :
అభ్యర్థులకు రాత పరీక్ష, ప్రాక్టికల్/పోర్ట్‌ఫోలియో, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష, ఇతర ప్రక్రియలు JNAFAU క్యాంపస్‌లోనే నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, దరఖాస్తు ఫీజు డీడీని మాసబ్ ట్యాంక్‌లోని JNAFAU క్యాంపస్‌లోని యూనివర్సిటీ కార్యాలయంలో సమర్పించాలి. స్కల్ప్చర్ కోర్సుకు దరఖాస్తు చేసేవారు 5×7 అంగుళాల పరిమాణంలో అటెస్టెడ్ పాస్‌పోర్ట్ ఫొటోలు రెండు జతచేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ :
అభ్యర్థులు అక్టోబర్ 12, 2026లోగా దరఖాస్తులను సమర్పించాలి. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. రూ.2,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


