జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “డ్రాగన్” సినిమా గ్లింప్స్ విడుదలైంది. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూవీని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన “డ్రాగన్” గ్లింప్స్ ఎట్టకేలకు రిలీజ్ అయింది.
మ్యాన్ ఆఫ్ మాస్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అద్దిరిపోయే బర్త్డ డే గిఫ్ట్ ఇచ్చేశారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎప్పుడో ప్రకటించిన సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కు “డ్రాగన్” అంటూ పేరు పెట్టారు. ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో ముందు నుంచే వైరల్ అయింది.
అయితే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎన్టీఆర్ చేత బీభత్సాన్ని సృష్టించేసాడు ప్రశాంత్ నీల్.
రిలీజ్ అయిన గ్లింప్స్ వణుకు పుట్టించేలా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ గ్లింప్స్ వీడియో సాధారణ టీజర్ల కాకుండా ఏకంగా నాలుగు నిమిషాలకు పైగా నిడివితో పూర్తిస్థాయి ట్రైలర్ తరహాలో రావడం ఇంకొక విశేషం.

కేజిఎఫ్, సల్లార్ వంటి సినిమాల తో ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ వీడియోలో తన మార్క్ యాక్షన్ ఎలివేషన్ ని ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా కట్ చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా మొత్తం కూడా భారీ కాన్సెప్ట్ లో ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ వీడియోలు అనేక పాత్రలను ఇంట్రడ్యూస్ చేసిన అందరికన్నా హైలెట్గా మారింది మాత్రం ఎన్టీఆర్ పాత్ర.
ఈ సినిమాను వచ్చే ఏడాది 2027 జూన్ 11 న రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫిషియల్ గా ప్రకటించారు.
మరి ఎందుకు ఆలస్యం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ వండర్ అయిన “డ్రాగన్” ప్రపంచాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి..!!
Read Warangal News and Latest Politics News and Real Estate
FAQ’s
ఎన్టీఆర్ “డ్రాగన్” గ్లింప్స్ ఎందుకు వైరల్ అవుతోంది?
ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లుక్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, 4 నిమిషాల భారీ విజువల్స్ కారణంగా “డ్రాగన్” గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“డ్రాగన్” మూవీ డైరెక్టర్ ఎవరు?
ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
“డ్రాగన్” సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?
“డ్రాగన్” మూవీని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
“డ్రాగన్” సినిమాలో హీరో ఎవరు?
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
“డ్రాగన్” గ్లింప్స్ ఎంత నిడివి ఉంది?
ఈ గ్లింప్స్ వీడియో సుమారు నాలుగు నిమిషాలకు పైగా నిడివితో విడుదలైంది.


