హన్మకొండ జిల్లా న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జీలను జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీపై వస్తున్న న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రతీక్ సిహాగ్: రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి నుండి హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీగా నియమితులయ్యారు.
శ్రద్ధా సెహగల్: రంగారెడ్డి జిల్లా ఎల్.బి. నగర్ నుండి హన్మకొండ అదనపు జూనియర్ సివిల్ జడ్జీగా బదిలీ అయ్యారు.
తదూరి మహతి వైష్ణవి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి హన్మకొండ 1 అదనపు జూనియర్ సివిల్ జడ్జీగా నియమితులయ్యారు.
జిల్లాలో న్యాయసేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.


