హనుమకొండ | 27-02-2026
గత పార్లమెంట్ సమావేశాల్లో Dr. Kadiyam Kavya ప్రవేశపెట్టిన “అనాథ వితంతువులు, ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు – 2025” కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
ఈ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం, President of India భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం లోక్‌సభలో పరిశీలించేందుకు సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది.
ఈ విషయాన్ని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి Annapurna Devi లోక్‌సభ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు.
ప్రైవేట్ మెంబర్స్ బిల్లులతో ప్రత్యేక గుర్తింపు
గత ఏడాది డిసెంబర్ 6న పార్లమెంట్‌లో మహిళల సంక్షేమం, గౌరవం, భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో డా. కడియం కావ్య రెండు ప్రైవేట్ మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఎంపీగా ఆమె గుర్తింపు పొందారు.
ఎంపీ స్పందన
రాష్ట్రపతి ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డా. కడియం కావ్య మాట్లాడుతూ—
“ఈ బిల్లు కేవలం చట్టపరమైన ఆమోదంతోనే ఆగిపోకుండా, కార్యరూపం దాల్చి అనాథ వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రత్యక్ష హక్కులు, భద్రత, సంక్షేమ ఫలాలు అందే వరకూ నా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
📌 ఈ బిల్లు అమలులోకి వస్తే అనాథ వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ, పునరావాసం, సంక్షేమానికి కీలక చట్టపరమైన బలం లభించనుంది.


