ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య :
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ శాంతి కలగాలని ఆకాంక్షించారు.
బక్రీద్ పండుగ త్యాగం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. సమాజంలో పరస్పర ప్రేమ, కరుణ, సహనం పెంపొందించడంలో ఈ పండుగ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అన్నారు.
భక్తి భావం, విశ్వాసం, ఐక్యతకు సంకేతమైన బక్రీద్ పండుగ ప్రజల మధ్య సోదర భావాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు అలాగే తెలంగాణ రాష్ట్రం శాంతి సుభిక్షలతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.


