వరంగల్ జిల్లాలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ-కోర్టుల విస్తరణ మరియు డిజిటల్ న్యాయ సేవల పురోగతిపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్సభలో ప్రత్యేకంగా ప్రశ్నించారు. కోర్టు భవనాల నిర్మాణాలు, ఈ-సేవా కేంద్రాల ఏర్పాటు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా జిల్లాకు అందిన ఆర్థిక సహాయంపై ఆమె స్పష్టత కోరారు.
దీనికి కేంద్ర శాసన, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్రం అందించిన వివరాలు:
జిల్లా, సబ్ఆర్డినేట్ కోర్టులలో మౌలిక వసతుల కల్పన దిశగా రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు 1993-94 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.
కేటాయించిన నిధులు:
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణకు మొత్తం రూ.11.16 కోట్లు విడుదల చేసి వినియోగించినట్లు కేంద్రం వెల్లడించింది.
• 2024-25: రూ. 1.96 కోట్లు
• 2025-26: రూ. 9.20 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 15.79 కోట్ల మదర్ శాంక్షన్ మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
వేగవంతమైన న్యాయం – ఆధునిక సాంకేతికత అవసరం: ఎంపీ కడియం కావ్య
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందాలంటే మెరుగైన మౌలిక వసతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.
ఈ-కోర్టుల ఫేజ్-3 ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లాకు కావాల్సిన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలి. జిల్లాలో ఈ-సేవా కేంద్రాల ఏర్పాటు, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుంది. కోర్టుల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త న్యాయ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిరంతరం కృషి చేయాలి.” — డాక్టర్ కడియం కావ్య, ఎంపీ (వరంగల్)
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

