HomeWarangal Newsచీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సమీక్ష సమావేశం

చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సమీక్ష సమావేశం

Published on

spot_img

హనుమకొండ తేదీ: 22-01-2026

చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సమీక్ష సమావేశం

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు

మూడు నెలల్లోపు పనులు ప్రారంభించాలి.. లేకపోతే రద్దు చేస్తాం

ప్రతి పని పురోగతి పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి – ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లోని ఎంపీ ఛాంబర్‌లో చీఫ్ ప్లానింగ్ అధికారులతో ముఖ్యమైన సమీక్ష సమావేశం నిర్వహించారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

ఈ సమావేశంలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ..

• పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల నుంచి మొత్తం రూ. 8 కోట్ల 30 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

• అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చిన తేదీ నుంచి మూడు నెలల లోపు పనులు తప్పనిసరిగా ప్రారంభించాలి.

• లేని పక్షంలో ఆ పనులను రద్దు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

• ఎంపీ నిధులతో చేపట్టే ప్రతి అభివృద్ధి పని పురోగతి వివరాలు పబ్లిక్ డొమైన్లో (ప్రజలకు అందుబాటులో) ఉండాలి.

• ఏవైనా టెక్నికల్ సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

• ప్రజలకు నేరుగా మేలు చేసే కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలి.

• అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలు, పెండింగ్ ప్రాజెక్టుల స్థితి, భవిష్యత్ ప్రణాళికలను ఎంపీకి వివరించారు.

సమావేశంలో చీఫ్ ప్లానింగ్ అధికారులు సత్యనారాయణ రెడ్డి, చంద్రకళ, కొట్యా నాయక్, బాబురావు, పంచాయతీరాజ్ అధికారులు ఆత్మా రామ్, రమేష్ బాబు, కిషన్, సతీష్ బాబు, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, టీజీఈడబ్ల్యూఐడిసీ అధికారి కిషన్, డిడబ్ల్యుఓ రాజమణి, మిషన్ భగీరథ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...