స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
తేదీ: 25.01.2026
నిన్న కొందరు BRS నాయకులు వచ్చి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి మేమే కారణమని ప్రచారం చేస్తున్నారు.
సిగ్గులేకుండా అవసరమైన అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
గత ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించాడు. నియోజకవర్గ గౌరవాన్ని పోగొట్టాడు. ఇప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను.
నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులన్నీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినవే. వాటికి సంబంధించిన GOలు, తేదీలతో సహా మీడియా ద్వారా ప్రజల ముందుంచాను.
గత ఎమ్మెల్యే చిన్న చిన్న పనులతో నియోజకవర్గ ప్రజలను తలదించుకునే స్థితికి తెచ్చాడు.
ఇప్పుడు ఒక గజ దొంగకు తోడుగా ముగ్గురు స్టువర్టుపురం దొంగలు వచ్చారు. ఈ దొంగలతో నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
వీళ్లు రాజయ్యను ఉద్ధరించడానికి రాలేదు… బొంద పెట్టడానికి వచ్చారు.
రాజయ్యను డమ్మీ చేయడానికే ఇంచార్జ్‌లుగా పల్లా, ఎర్రబెల్లి, పోచంపల్లి వచ్చారు.
ఎర్రబెల్లి చెవిటోడు… సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు.
తన మనవరాల వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఓడిపోయాక చిన్న మెదడు చిటికిపోయింది.
టీడీపీని హోల్‌సేల్‌గా అమ్మిన నీచ చరిత్ర ఎర్రబెల్లిది.
కేసీఆర్ చుట్టూ బొచ్చు కుక్కలా తిరిగి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు.
కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి నాశనం చేసింది పల్లా నే.
అసలు పొట్టోడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
కేటీఆర్, సంతోష్ రావుల బినామీ పోచంపల్లి.
ఇక్కడ ఉన్న పెద్ద గజ దొంగకు తోడుగా మరో ముగ్గురు స్టువర్టుపురం దొంగలు వచ్చారు. ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలకు సూచించారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… నిన్న కొంతమంది BRS నాయకులు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేసి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ అభివృద్ధి జరగలేదని, 100 పడకల హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మున్సిపాలిటీ అప్‌గ్రేడేషన్‌కు మేమే కారణమని తప్పుదారి పట్టించేలా మాట్లాడారని అన్నారు.
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంజూరైన అభివృద్ధి పనుల వివరాలు GOలతో సహా మీడియా ద్వారా ప్రజల ముందుంచానని చెప్పారు.
గత ప్రభుత్వంలో నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, గత ఎమ్మెల్యే జల్సాలకు అలవాటు పడి నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చాడని అందరికీ తెలుసని అన్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, డిగ్రీ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్సిపాలిటీ అప్‌గ్రేడేషన్, 50 కోట్ల నిధులు – ఇవన్నీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మంజూరయ్యాయని వెల్లడించారు.
గత ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో, చెడ్డ పేరు వచ్చిందో అందరికీ తెలుసు. అవినీతితో, చిల్లర పనులతో ప్రజలను తలదించుకునే స్థితికి తెచ్చాడని ఆరోపించారు.
2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడానికి, రాజయ్యకు టికెట్ ఇస్తే గెలుస్తామని కేసీఆర్‌కు చెప్పినవారు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముగ్గురేనని తెలిపారు.
ఇప్పుడు రాజయ్యకు వ్యతిరేకంగా చెప్పిన వీళ్లే ఇంచార్జ్‌లుగా వచ్చారని, రాజయ్యను డమ్మీ చేసి బీజేపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదా కాంగ్రెస్ నాయకులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
చెవిటోడు ఎర్రబెల్లి మతి బ్రమించి మాట్లాడుతున్నాడు. మనవరాల వయసు అమ్మాయి చేతిలో ఓడిపోయాక చిన్న మెదడు చిటికిపోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
టీడీపీని హోల్‌సేల్‌గా కేసీఆర్‌కు అమ్మిన నీచ చరిత్ర నీదని, కాంగ్రెస్‌లోకి రావాలని ప్రయత్నించావు కానీ నీ చరిత్ర చూసి రేవంత్ రెడ్డి రానివ్వలేదని అన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసింది పల్లా. కేసీఆర్ చుట్టూ బొచ్చు కుక్కలా తిరిగి వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. కవిత చెప్పినట్టు కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని, అందులో పెద్దది పల్లా అని అన్నారు.
అసలు పొట్టోడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. కేటీఆర్, సంతోష్ రావుల బినామీ అతడే. వాళ్ల డబ్బులు రియల్ ఎస్టేట్‌లో ఖర్చు పెడుతున్నాడు. గెలవడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే ఈ ముగ్గురు ఇంచార్జ్‌లుగా వచ్చారని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న స్టేషన్ ఘనపూర్‌ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుంది. కాంగ్రెస్ లేకుండా అభివృద్ధి జరగదు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, రేపు జరిగే ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, శక్తి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉన్నంత కాలం వీరితోనే ఉంటానని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


