గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ ఈసంపల్లి జోనా, పలు విభాగాల అధికారులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సమాజానికి, సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. మాతృభాషా పరిరక్షణ, తెలంగాణ యాస, సంస్కృతుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


