హనుమకొండ: దివ్యాంగుల సహాయ ఉపకరణాల పథకం 2024–25లో భాగంగా కమలాపూర్ మండలానికి చెందిన దాసరి శ్రీనివాస్‌కు బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటోను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు.
దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకం కింద వాహనాన్ని అందించినట్లు తెలిపారు.
బ్యాటరీతో నడిచే మినీ ట్రేడింగ్ ఆటో ద్వారా శ్రీనివాస్ తన ఉపాధి కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం కలగనుంది. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇలాంటి సహాయక పథకాలు దోహదపడతాయి.
దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


