కంగనా రనౌత్ అమ్మాయిలకు ఏమి చెప్పింది?
- ముందుగా జీవితంలో స్థిరపడాలి
- తొందరపడి పెళ్లి చేసుకోవద్దు
- ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి
- కష్టాల్లో ఇతరులపై ఆధారపడకూడదు
- మహిళలు తమ నిర్ణయాలను తామే తీసుకోవాలి
కంగనా రనౌత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు..అందరికి సుపరిచితురాలే.
ఒకప్పుడు హీరోయిన్ గా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో బాగా సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భాజపా ఎంపీ.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూనే ఉంటారు. దానికి కారణం ఆమె మాట్లాడే మాటలు.
అంతేకాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆమె తత్వం. అందుకే ఆమెకి మిత్రులు కన్నా శత్రువులే ఎక్కువ అని చెప్పుకొస్తూ ఉంటారు ఫ్యాన్స్.
తాజాగా కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అమ్మాయిలకు కంగనా రనౌత్ అద్భుతమైన ఉపయోగపడే సలహా ఇచ్చింది.

“జీవితంలో స్థిరపడిన తర్వాత అమ్మాయిలు పెళ్లి గురించి ఆలోచించాలి అని..తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అని.. కష్టంలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి కాపాడతారని ఎదురు చూడొద్దు” అంటూ సలహా ఇచ్చారు.
ఇటీవల పలు రాష్ట్రాలలో వెలుగు చూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఈ విషయాన్ని Instagram వేదికగా తన స్టోరీలో పోస్ట్ గా పెట్టారు.
దీంతో సోషల్ మీడియాలో కంగనా రనౌత్ పేరు మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది అమ్మాయిలు కంగనా రనౌత్ ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నారు.

FAQ’s
1. కంగనా రనౌత్ ఏమన్నారు?
అమ్మాయిలు ముందుగా జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని కంగనా సూచించారు.
2. కంగనా ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?
తన Instagram స్టోరీ ద్వారా ఈ సందేశాన్ని పంచుకున్నారు.
3. ఎందుకు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి?
మహిళల స్వతంత్ర జీవితం, వరకట్న వేధింపుల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
4. కంగనా ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
కంగనా రనౌత్ ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


