కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavithaకు భారీ ఊరట లభించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ నమోదు చేసిన అభియోగాలను ఢిల్లీలోని Rouse Avenue Court కొట్టేసింది.
ఈ కేసులో కవిత ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కవితతో పాటు కేసులో నిందితులుగా ఉన్న 23 మంది పై కూడా తప్పు చేశారన్న సాక్ష్యాధారాలు లేవని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ పేర్కొన్నారు.
రాజకీయ పార్టీ సన్నాహాల్లో ఉన్న కవితకు ఈ తీర్పు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.


