మేడ్చల్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడ్చల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) గా ప్రకటించారు. గతంలో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన నేపథ్యంలో, కవిత మళ్ళీ అదే పాత సెంటిమెంట్ పేరుతో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.
”తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేని పాలనలో నేనూ భాగమైనందుకు సిగ్గుపడుతున్నాను, దీనికి క్షమాపణలు చెబుతున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయిందని, ఆ ఆత్మను మళ్ళీ బ్రతికించడానికే ఈ ‘TRS’ ఆవిర్భవించిందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలకు ‘అమ్మ’లా అండగా ఉంటాను” అని భావోద్వేగంగా ప్రకటించారు.
సభలో కవిత తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా రూపకల్పనలో పలు అర్థాలు దాగి ఉన్నాయి:

జెండాలో పసుపు, నీలి రంగులకు ప్రాధాన్యత ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌పై తెలుపు అక్షరాలతో ‘TRS’ అని ముద్రించారు.
బ్లూ కలర్ బడుగు, బలహీన వర్గాలకు సూచికగా.. పసుపు రంగు శుభసూచకంగా ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సభలో కవిత పేరును ప్రకటించగానే కార్యకర్తలు “సీఎం.. సీఎం..” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.


