హన్మకొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. కాజీపేట పరిధిలోని విష్ణుపురిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కల్తీ ఐస్‌క్రీం దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు.
విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ టీమ్, ఒక తయారీ కేంద్రంపై మెరుపు దాడులు చేసింది. అక్కడ దృశ్యాలు చూసి అధికారులు సైతం విస్తుపోయారు. కల్తీ తయారీ నాసిరకం వస్తువులతో ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 12 రకాల ఆహార ఉత్పత్తులు గడువు ముగిసినా (Expired) వాడుతున్నట్లు తేలింది. వీటి విలువ సుమారు ₹60,400 ఉంటుందని అంచనా. నిబంధనలు గాలికొదిలేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న షాపు యజమానిని టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్ టెస్టింగ్‌కు పంపారు.


