కాజీపేట : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కాజీపేట 63వ డివిజన్‌లో సుమారు రూ.163 లక్షల (1.63 కోట్లు) వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచన.
గత రెండున్నర ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని వెల్లడి.
గత పాలనలో శంకుస్థాపనలకే పరిమితమైన పనులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులతో పట్టాలెక్కిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామని నాయిని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల సమయానికి కాజీపేట ప్రాంతానికి సరికొత్త రూపునిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.


