కాజీపేటలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హరీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మద్యం మత్తులో బైక్ నడుపుతూ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీ కొట్టాడు. రాంపూర్ హనుమాన్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. యువకుడి తలకు బలమైన గాయమైంది.
స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది (చైతన్య, కుమారస్వామి) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.


