వరంగల్ పట్టణ ప్రజలకు కాజీపేట ట్రాఫిక్ పోలీసుల నుంచి ముఖ్య గమనిక విడుదలైంది.
2020 నుండి 2024 మధ్యకాలంలో డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, పెండింగ్ చలాన్లు లేదా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం వారి అధీనంలో ఉన్న ద్విచక్ర వాహనాలను యజమానులు తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.
అటువంటి వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు (ఆర్‌సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితరాలు) తీసుకుని కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ వాహనాన్ని స్వీకరించవచ్చని అధికారులు తెలిపారు.
వాహన యజమానులు త్వరితగతిన పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తమ వాహనాలను తీసుకెళ్లాలని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


