హనుమకొండ: కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ హనుమకొండలోని వడ్డేపల్లి చర్చి–అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారిపై నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి వరంగల్ నగరానికి అనుసంధానమయ్యే వడ్డేపల్లి చర్చి – అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారిపై కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు ఈ ముమ్మర తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఏసీపీ టి. సత్యనారాయణ, సీఐ పిట్టల వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు, డీఆర్ఎఫ్ (DRF) సిబ్బందితో కలిసి రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.
అదేవిధంగా రహదారిని ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన షాపుల నేమ్‌బోర్డులు, సైన్బోర్డులను పూర్తిగా తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. ఈ సందర్భంగా కాజీపేట ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న మాట్లాడుతూ… భవిష్యత్తులో ఈ రహదారిని 100 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నట్లు తెలిపారు. కాబట్టి వ్యాపారులు ఎవరూ కూడా రోడ్లపై ఆక్రమణలు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వ్యాపారులు రహదారులను ఆక్రమించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న హెచ్చరించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

