హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల సాధన కోసం, ప్రాజెక్టుల రక్షణ కోసం త్వరలోనే భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్దకు స్వయంగా వెళ్తానని కేసీఆర్ తెలిపారు. సుమారు లక్ష మంది జనంతో ఈ రెండు ప్రాజెక్టులను సందర్శించి, నీటి పారుదల రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రభుత్వాన్ని నేరుగా నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


