HomeWarangal Newsఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణకు సిట్ సన్నాహాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణకు సిట్ సన్నాహాలు

Published on

spot_img

తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలోకి చేరుకుంది.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను ఈ కేసులో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో సిట్ బృందం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన పర్సనల్ అసిస్టెంట్‌కు నోటీసు అందజేసింది.

Phone Tapping Notice to KCR

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.

కానీ వయసు (70 ఏళ్లు దాటినందున) దృష్ట్యా కేసీఆర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రప్పించాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన బాధ్యత లేదని, కాబట్టి కేసీఆర్ కోరిన స్థలంలోనే విచారణ నిర్వహిస్తామని తెలిపారు.

అయితే ఆ స్థలం హైదరాబాద్ నగర పరిధిలోనే ఉండాలనే షరతును విధించారు.

కేసీఆర్ ఏ ప్రదేశంలో విచారణ జరపాలని కోరుకుంటున్నారో ముందస్తుగా తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.

ఈ పరిమితి దృష్ట్యా నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Latest articles

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.

బొప్పాయిని రోజూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

రోజూ పరిమిత మోతాదులో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.