బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.
అదే రోజు నల్లబెల్లిలో నిర్వహించే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం ఈ నెల 10న హనుమకొండలో జరిగే సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు.
ఈ పర్యటనలు, సంస్మరణ కార్యక్రమాల ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పర్యటనల దృష్ట్యా ఏర్పాట్లను వేగవంతం చేయాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు సమీక్ష నిర్వహించి నిర్ణయించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


