HomeWarangal NewsSIR కార్యక్రమంపై హనుమకొండ కాంగ్రెస్ బీఎల్ఏల కీలక సమావేశం..!

SIR కార్యక్రమంపై హనుమకొండ కాంగ్రెస్ బీఎల్ఏల కీలక సమావేశం..!

Published on

spot_img

SIR కార్యక్రమంపై హనుమకొండ కాంగ్రెస్ బీఎల్ఏల కీలక సమావేశం:

హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 8 డివిజన్‌ల బీఎల్ఏల (Booth Level Agents) సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా పరిశీలన, ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమం పై ప్రత్యేకంగా చర్చించారు.

సమావేశంలో బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..”ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేందుకు బిఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సరిచేయడం కొత్త ఓటర్ల నమోదు తొలగింపులపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు”.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి డివిజన్లో ప్రత్యేక బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని.. బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ఇన్‌చార్జీలు, బిఎల్ఏలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించి పలు సూచనలు చేశారు. హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటున్నాయని నాయకులు పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles