వరంగల్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) పీజీ విద్యార్థి ప్రణయ్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రణయ్ తన స్కూటీపై వెళ్తుండగా, కేఎంసీ సమీపంలో ఒక బొలెరో వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ప్రణయ్ రెండు చేతులు విరగడంతో పాటు, తలకు కూడా బలమైన గాయం అయింది. ముక్కు, చెవుల నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.


