వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC) లో ర్యాగింగ్ తరహా ఘటన చోటుచేసుకుంది. బీఎస్సీ రేడియాలజీ చదువుతున్న సీనియర్ విద్యార్థులు, జూనియర్లను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజికల్ గార్డెన్‌కు పిలిపించి కొట్టినట్లు సమాచారం.
MGM ఆసుపత్రిలో క్లినికల్ శిక్షణ పొందుతున్న సమయంలో, జూనియర్లు తమకు తగిన విలువ ఇవ్వడం లేదనే నెపంతో సీనియర్లు ఈ దాడికి పాల్పడ్డారు. బాధితులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించగా, వారు వెంటనే KMC ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.


