HomeLatest News"నిరీక్షణ ముగిసింది"..కొండా సురేఖ సంచలన ప్రకటన!

“నిరీక్షణ ముగిసింది”..కొండా సురేఖ సంచలన ప్రకటన!

Published on

spot_img

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత కొండా సురేఖ తొలిసారి స్పందించారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె.. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు సురేఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

త్వరలో కీలక ప్రకటన :

“నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా” అంటూ సురేఖ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామాల నేపథ్యంలో ఆమె తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆమె తీసుకోబోయే నిర్ణయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

తల్లి బర్తరఫ్‌పై కుమార్తె ఆగ్రహం :

మరోవైపు, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన తల్లిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కొండా కుటుంబం ‘ప్లాన్ బీ’ ఏంటి? :

తన తల్లిపై చర్య తీసుకోవడం బాధ కలిగించిందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా మురళి వ్యవహారశైలి కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీంతో కొండా కుటుంబం తదుపరి వ్యూహం ఏమిటనే ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. సురేఖ ప్రకటించబోయే నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

konda  surekha FB post
konda surekha FB post

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.