HomeLatest Newsరేవంత్‌పై కొండా సురేఖ డైరెక్ట్ అటాక్.. సంచలన వ్యాఖ్యలు!

రేవంత్‌పై కొండా సురేఖ డైరెక్ట్ అటాక్.. సంచలన వ్యాఖ్యలు!

Published on

spot_img

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డిపై ఆమె నేరుగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

‘రేవంత్‌ పదేళ్లు సీఎం అంటున్నారు’ :

రేవంత్‌రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని సురేఖ ప్రశ్నించారు. కేబినెట్‌లోని పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, సీఎం సహా మంత్రులు, నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. హైకమాండ్‌కు మొత్తం అంశాలను రాతపూర్వకంగా వివరించినట్లు తెలిపారు.

‘బీసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?’ :

తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తనను ఎందుకు శిక్షించాలని సురేఖ ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

హైకమాండ్‌ నిర్ణయంపై ఉత్కంఠ :

అంతా సద్దుమణిగిందని భావిస్తున్న సమయంలో సురేఖ చేసిన తాజా వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశమేంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ఆమెపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.